20-01-2026 01:33:03 AM
పలు వెబ్‌సిరీస్‌లతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న రచయిత-, నటుడు గవిరెడ్డి శ్రీను ‘శుభం’ సినిమాతో సినీప్రియులకు సుపరిచితులయ్యారు. ఇప్పుడాయన హీరోగా కెరీర్‌లో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. ఆయన కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం ‘చీన్ టపాక్ డుం డుం’. తాజాగా ఈ సినిమా పూజా కార్యక్రమంతో ప్రారంభమైంది. ఈ కార్యక్రవానికి స్టార్ హీరోయిన్ సమంత, దర్శకులు మల్లిడి వశిష్ఠ, గోపిచంద్ మలినేని, నందినిరెడ్డి, వీవీఎస్ రవి, గౌతమి హాజరయ్యారు.
‘మా ఇంటి బంగారం’ మూవీ సెట్స్‌లో జరిగిన ఈ చిత్ర ముహూర్తపు సన్నివేశానికి సమంత క్లాప్ కొట్టారు. గోపిచంద్ మలినేని తొలి షాట్‌కు దర్శకత్వం వహించారు. మల్లిడి వశిష్ఠ కెమెరా ఆన్ చేశారు. నందిని రెడ్డి, బీవీఎస్ రవి, గౌతమి స్క్రిప్టును టీమ్‌కు అందజేశారు. ఈ చిత్రాన్ని శ్రీను నాగులపల్లి నిర్మిస్తున్నారు. ఆయన సంస్థ విలేజ్ టాకీస్‌లో తెరకెక్కిస్తున్న తొలి సినిమా ఇదే కావడం విశేషం. వైఎన్ లోహిత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో బ్రిగిడా సాగా కథానాయిక. ఈ చిత్రానికి సంగీతం: పీఆర్; సినిమాటోగ్రఫీ: సెంథిల్ కుమార్; సాహిత్యం: తిరుపతి జావానా; ఆర్ట్: ఏఎస్ ప్రకాశ్; కథ, స్క్రీన్‌ప్లే: దివ్య తేజస్వి, విక్రమ్ కుమార్ కే, నాగ్ ట్రైల్లేజర్, ఏకలవ్య.