11-08-2025 10:29:48 AM
బోరు వేసిన కాంట్రాక్టరుపై చర్యలు తీసుకోవాలి
మంగపేట బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు గోమాస సావిత్రి
మంగపేట,(విజయక్రాంతి): ములుగు జిల్లా మంగపేట మండలంలో(Mangapet Mandal) తిమ్మంపేట గ్రామంలో ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు ప్రతి రోజు త్రాగునీరు అందక అనేక ఇబ్బందులు పడుతున్నారని బీజేపీ పార్టీ మంగపేట మండల మహిళా మోర్చా అధ్యక్షురాలు గోమాస సావిత్రి అన్నారు. ఈసందర్భంగా బీజేపీ పార్టీ మంగపేట మండల మహిళా మోర్చా అధ్యక్షురాలు గోమాస సావిత్రి మాట్లాడుతూ... తిమ్మంపేట గ్రామంలో ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వంటల్లో మంచినీరు అందించే బోరు కుంగి చుట్టూ మురికి నీళ్లు బయటకు పోకుండా బోరులోనే ఇంకి మరల పొద్దున్నే అదే బోరు మంచినీటిని విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వంటల్లో త్రాగడానికి అదే నీరు వాడుతారు.
అసలే వర్షాకాలం మలేరియా డెంగ్యూ సీజన్ కావడంతో విద్యార్థులకు ప్రమాదకరంగా మారకుండా ముందు జాగ్రత్తగా మండల విద్యాశాఖ అధికారి ఎంపిడిఓ పాఠశాల ప్రధానోపాధ్యాయులు గ్రామ కార్యదర్శి స్పందించి కుంగిన బోరు స్థలంలో కంకరతో నింపి ప్లోరింగ్ చేసి కుంగిన బోరు వల్ల విద్యార్థులకు ఎలాంటి ప్రమాదం సంఘటనలు జరుగకుండా ముందు జాగ్రత్తగా దాని చుట్టూ పెన్సింగ్ వేపించాలని సదరు కాంట్రాక్టర్ నాణ్యమైన కంకర పోయక డబ్బులకు కక్కుర్తి పడి మట్టితో నింపడం వలన ఇలా కుంగింది బోరు వేసిన కాంట్రాక్టరుపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.