11-08-2025 01:01:34 PM
హైదరాబాద్: హనుమకొండలో మంత్రి కొండా సురేఖ(Minister Konda Surekha) ఇంటి ముందు సోమవారం ఆందోళన నెలకొంది. సీఐటీయూ ఆధ్వర్యంలో మంత్రి ఇంటి ముందు మహిళా కార్మికులు ఆందోళన చేశారు. మధ్యాహ్న భోజన బాధ్యతలు అక్షయపాత్ర సంస్థకు ఇవ్వొద్దని మధ్యాహ్న భోజన కార్మికులు(Lunch workers) డిమాండ్ చేస్తున్నారు. మంత్రి ఇల్లు ముట్టడించేందుకు కార్మికులు యత్నించారు. రంగంలోకి దిగిన పోలీసులు నిరసన తెలుపుతున్న వారిని అదుపులోకి తీసుకున్నారు. మధ్యాహ్న భోజన పథకం పెండింగ్ బిల్లులు(Pending bills) వెంటనే చెల్లించాలని, డబ్బులు లేక ఇబ్బంది పడుతున్నామని కార్మికుల ఆగ్రహం వ్యక్తం చేశారు.