calender_icon.png 11 August, 2025 | 1:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొటం కూలి మేకలు మృతి

11-08-2025 10:26:17 AM

కన్నీరు పెట్టుకున్న మేకల కాపాలదారులు

మహమ్మదాబాద్: రెక్క అడితేగాని..డొక్కా ఆడని పేద కుటుంబం వారిది. ప్రతిరోజు మేకలు కాస్తు తమ కుటుంబాన్ని పోషించుకుంటు జీవనం కొనసాగిస్తున్నారు. వివరాల్లోకి వెళితే ఇలా ఉన్నాయి.. మండల పరిధిలోని జూలపల్లి గ్రామానికి(Julapalli village) చెందిన కొత్లబాద మంజుల కొన్ని మేకలను కొనుగోలు చేసి వాటికి కాపరిగా ఉంటూ జీవనం కొనసాగిస్తుంది. మేకలు కాస్తేనే కుటుంబం గడవదని మంజుల భర్త లాలయ్య  హైదరాబాదులో కూలిపని చేస్తూ ఊరికి వీలు దొరికినప్పుడు వచ్చి వెళ్లేవారు. ఇది ఇలా ఉండగా మేకల కాస్తూ కుటుంబానికి అండగా ఉంటున్న కొతులాబాద్ మంజుల తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

రోజు మాదిరిగానే మేకలను మేపి వ్యవసాయ పొలం దగ్గర మేకలను కొటంలో కట్టేసి ఇంటికి వచ్చాను రాత్రి కురిసిన భారీ వర్షానికి. సిమెంటు రేకులకు సపోర్ట్ గా కింద ఉన్న నిలువు కట్టెలు విరిగి మేకల కోటం ఒక్క సరిగా కూలిపోయింది. ఒక్కసారిగా కూలిపోవడంతో సిమెంట్ రేకులు కోటం లో ఉన్న 20 మేకలపై పడడంతో 6 మేకలు మృతి చెందాయి. మిగతా మేకలకు తీవ్ర గాయాలు అయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. చనిపోయిన ఆరు మేకలకు సంబంధించి దాదాపుగా రూ 70 వేల వరకు ఆదాయం సమకూరేదని నెలల తరబడి గుట్టనకా..చెట్లను తిరిగి మేకలను మేపినప్పటికీ తీవ్ర నష్టం వాటిదని మేకల కాపరి కొతులాబాద్ మంజుల కన్నీరు పెట్టుకొంటున్నారు.  ప్రభుత్వం నుంచి తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు.