calender_icon.png 11 August, 2025 | 5:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఢిల్లీలో హై టెన్షన్.. రాహుల్ గాంధీ అరెస్ట్

11-08-2025 01:16:45 PM

న్యూఢిల్లీ: ఎన్నికల కమిషన్ అధికార బిజెపితో కుమ్మక్కయ్యిందని నిరసన వ్యక్తం చేస్తూ సోమవారం ఉదయం ఢిల్లీ వీధుల్లోకి నిరసనలు వెల్లువెత్తడంతో ఢిల్లీ పోలీసులు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ(Rahul Gandhi), ప్రియాంక గాంధీ వాద్రా, శివసేన (యుబిటి) నాయకుడు సంజయ్ రౌత్ సహా సీనియర్ ప్రతిపక్ష ఎంపీలను అదుపులోకి తీసుకున్నారు. రాహుల్ గాంధీ, ఆయన సహచరులు బస్సులో వెళ్ళినప్పుడు, ఆయన విలేకరులతో మాట్లాడుతూ... "ఈ పోరాటం రాజకీయమైనది కాదు... ఇది రాజ్యాంగాన్ని కాపాడటం కోసం. ఈ పోరాటం 'ఒక వ్యక్తి, ఒక ఓటు' కోసం." అన్నారు. 

జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ దీపక్ పురోహిత్ నిర్బంధాన్ని ధృవీకరించారు. నిర్బంధించబడిన ఇండియా బ్లాక్ నాయకులను సమీపంలోని పోలీస్ స్టేషన్‌కు తరలించామని విలేకరులతో అన్నారు. పార్లమెంట్ సమీపంలో ఉద్రిక్తత నెలకొంది. రాహుల్ గాంధీ నేతృత్వంలో ఇండియా కూటమి నేతలు పార్లమెంట్ నుంచి ఎన్నికల కమిషన్ కార్యాలయానికి ర్యాలీ నిర్వహించారు. ఇకనైనా ఓట్ల చోరీ జరగకుండా చూడాలని విపక్ష నేతలు డిమాండ్ చేశారు. బిహార్ ఓట్ల జాబితా సవరణకు నిరసనగా కూటమి నేతలు ర్యాలీ తీశారు. 2024 లోక్ సభ ఎన్నికల్లో ఓట్ల చోరీ జరిగిందంటూ పవిక్షాలు నిరసన చేపట్టారు. ర్యాలీకి విపక్ష నేతలు ఎలాంటి అనుమతులు తీసుకోలేదని ఢిల్లీ పోలీసులు(Delhi Police) స్పష్టం చేశారు. పోలీసులు అడ్డుకోవడంతో విపక్ష నేతలు కాసేపు బైఠాయించి నిరసన తెలిపారు.