11-08-2025 01:21:29 PM
తిమ్మాపూర్,(విజయక్రాంతి): తాత ముత్తాతల నుండి సాగు చేసుకుంటున్న భూములకు యాజమాన్య హక్కులు కల్పించాలని కరీంనగర్ జిల్లా(Karimnagar District) తిమ్మాపూర్ మండల బీజేపీ అధ్యక్షులు సుగుర్తి జగదీశ్వరాచారి, న్యాయవాది సుగుర్తి జగదీశ్వరాచారి డిమాండ్ చేసారు.పోడు భూములకు హక్కులు కల్పించాలని డిమాండ్ చేస్తూ కొమరం భీమ్ జిల్లా చింతమానే పల్లి మండలం, దిందా గ్రామస్తులు చలో హైదరాబాద్ పేరిట ఈనెల 6 నుండి పాదయాత్ర చేస్తున్నారు.కాగా పాదయాత్ర చేస్తున్నవారు ఆదివారం రాత్రి వరకు తిమ్మాపూర్ మండలం రామక్రిష్ణ కాలనీ కి చేరుకున్నారు.సుమారు 45 మందికి రాత్రి పూట బస తో పాటుగా భోజన వసతులు ఏర్పాటు చేసినట్లు అధ్యక్షులు తెలిపారు.పాదయాత్ర చేస్తున్న వారికి ఎటువంటి ఇబ్బంది జరిగినా ప్రభుత్వమే భాద్యత వహించాలని డిమాండ్ చేసారు.పోడు భూముల సాగు విషయంలో అటవీ అధికారులతో వారి కుటుంబాలకు ఎదురవుతున్న ఇబ్బందులను గ్రామస్తులు ఏడుస్తూ పేర్కొన్నారు.
బిసి కులానికి చెందిన తామంతా నలభై ఏళ్లుగా వ్యవసాయం పైనే ఆదారపడి బతుకుతున్నామని తెలిపారు.వ్యవసాయం తప్ప వేరే ఎటువంటి పనులు రావని ఆవేదన వ్యక్తం చేసారు.క్రూర మృగాలకు ఇచ్చే ప్రాముఖ్యత కూడా తమలాంటి వారికి ఎందుకు ఇవ్వడం లేదని కన్నీరు,మున్నీరుగా విలపించారు.పిల్లలను, ముసలివాళ్ళను ఇండ్లల్లో ఉంచి హైదరాబాద్ వరకు పాదయాత్ర చేసుటకు సిద్ధమయ్యా మని తెలిపారు.వర్షం లో తడుస్తూ,ఎండకు ఎండుతూ కాళ్ళ కు బొబ్బలు వస్తున్నా కూడా పాదయాత్ర పై వెనుకడుగు వేయబోయమని పేర్కొన్నారు.దిందా గ్రామం లో పోడు భూములను సాగు చేసుకుంటున్న బిసి లకే అటవీ అధికారుల వల్ల సమస్యలు వస్తున్నాయని తెలిపారు.
పాదయాత్ర చేస్తున్న వారి కి కరీంనగర్ జిల్లా అధికార ప్రతినిధి బొంతల కళ్యాణ్ చంద్ర, స్థానిక బీజేపీ నాయకులు,ఆవుల వేణు యాదవ్, కోతి రాజు,ఎడ్ల భూరెడ్డి,వేల్పుల ఓదయ్య,దుర్గుంటి శేఖర్ రెడ్డి,సిద్ద శ్రీనివాస్,ఆవుల మల్లేశం,బోళ్ల శంకర్ తో పాటుగా గ్రామస్తులు సంఘీభావం ప్రకటించారు.న్యాయపరమైన డిమాండ్ తో చేస్తున్న పాదయాత్ర పై ప్రభుత్వం వెంటనే స్పందించి భూములకు హక్కులు కల్పించేలా చర్యలు తీసుకునేలా పాదయాత్ర సంకల్పం నెరవేరాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. పాదయాత్ర చేస్తున్న వారికి మానవతా దృక్పధం తో తగిన ఏర్పాట్లు చేసినటువంటి సహాయక చర్యలపై తెలుసుకున్నటువంటి సిర్ పూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే పాల్వాయ్ హరీష్ బీజేపీ అధ్యక్షులు జగదీశ్వరాచారి కి ఫోన్ ద్వారా ధన్యవాదములు తెలిపారని పాదయాత్ర చేస్తున్నవారు తెలిపారు.