calender_icon.png 27 July, 2025 | 9:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహిళా అదృశ్యం

26-07-2025 11:35:36 PM

ఎల్లారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా(Kamareddy Districtఎల్లారెడ్డి మండలంలోని బిక్కనూరు గ్రామానికి చెందిన సౌందర్యా అనే మహిళా అదృశ్యం అయినట్లు తల్లి సాయవ్వ ఎల్లారెడ్డి పోలీస్ స్టేషన్లో శనివారం ఫిర్యాదు చేశారు. అదృశ్యమైన మహిళా తల్లి సాయవ్వ ఫిర్యాదు మేరకు, ఎల్లారెడ్డి ఎస్ఐ మహేష్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఎల్లారెడ్డి మండలం బిక్కనూరు గ్రామానికి చెందిన సాయవ్వకు ఇద్దరు కూతుర్లు, చిన్న కూతురు అయిన సౌందర్య వయసు 20 సంవత్సరాలు తన భర్తతో కలిసి తల్లిగారి ఇంటి వద్దనే ఉంటుంది.

మహిళా తల్లి, సాయమ్మ ఆదివారం చర్చికి వెళ్దామని కూతుర్ని రమ్మని అడగగా మీరు వెళ్లి రండి నేను ఇంటి వద్దనే ఉంటానని చెప్పి తల్లి వచ్చేవరకు తన కూతురు కనిపించకుండా పోయిందని, కంగారు తిన్న తల్లి తన కుటుంబ సభ్యులకు, బంధువులకు సమాచారం అందించడంతో ఎక్కడ వెతికిన ఆచూకీ లభించకపోవడంతో ఎల్లారెడ్డి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు ఎస్ఐ మహేశ్ తెలిపారు. అదృశ్యమైన మహిళ తల్లి ఫిర్యాదు మేరకు, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ మహేష్ తెలిపారు.