calender_icon.png 27 July, 2025 | 9:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎండు గంజాయి, గోవా మ‌ద్యం స్వాధీనం

26-07-2025 11:38:12 PM

మునిప‌ల్లి: బీద‌ర్ నుంచి ఎండు గంజాయిని హైద‌రాబాద్ కు త‌ర‌లిస్తున్న‌ట్లు న‌మ్మ‌ద‌గిన స‌మాచారం మేర‌కు టాస్క్ ఫోర్స్ మెద‌క్ డిప్యూటీ  క‌మిష‌న‌ర్ హ‌రిక్రిష్ణ(Task Force Deputy Commissioner Harikrishna) ఆదేశాల మేర‌కు శ‌నివారం నాడు  మునిప‌ల్లి  మండ‌లం కంకోల్ టోల్ ప్లాజా వ‌ద్ద జిల్లా టాస్క్ ఫోర్స్ అధికారులు వాహ‌నాల త‌నిఖీ చేప‌ట్టారు. ఈ క్ర‌మంలో ఓ ఆటోపై అనుమానం రావ‌డంతో ఆపి త‌నిఖీచేయ‌గా అందులో ఎండుగంజాయి ఉన్న‌ట్లు గుర్తించారు.

మొహినాబాద్, లంగ‌ర్ హౌస్ కు చెందిన కంచె రాకేష్, నాంపల్లి శుభం, ధర్మరాజు సాయి కుమార్, పోరంపల్లి శ్రీకాంత్ అక్రమంగా ఎండు గంజాయి ఆటోలో బీదర్ నుండి సరఫరా చేస్తున్న వ్యక్తి అదుపులోకి తీసుకున్న‌ట్లు తెలిపారు. వారి వద్ద నుండి 501 గ్రాముల ఎండు గంజాయి, ఆటో, 04 మొబైల్ ఫోన్స్ ను స్వాధీనం చేసుకోగా గోవా నుండి వచ్చే వాహనాలను తనిఖీ చేస్తుండంగా వివిధ బ్రాండ్ లకి సంబంధించిన 3.30 లిటర్స్ సుంకం చెల్లించని మ‌ద్యాన్ని స్వాధీనం చేసుకొని సంగారెడ్డి ఎక్సైజ్ స్టేషన్  త‌ర‌లించారు. ఈ దాడుల్లో  టీం సీఐ శంకర్, చంద్ర శేఖర్, ఎస్సైలు హనుమంతు, అనుదీప్, అనిల్ సిబ్బంది ఉన్నారు.