బీసీ రాజకీయాలపై చర్చ..
- తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకులకు సన్మానం
- ఉద్యమానికి ఆర్థిక సహాయం అందించిన ఎర్ర స్వాతి శ్రీహరి గౌడ్
నాగోల్, జూలై 12 (విజయ క్రాంతి): తెలంగాణ రాజ్యాధికార పార్టీ మహిళా అధ్యక్షురాలు పటేల్ వనజక్క, పార్టీ రాష్ట్ర కార్యదర్శి గిరగాని బిక్షపతి గౌడ్, అడ్వకేట్ కర్రు పావనిని నాగోల్ లో వారి నివాసంలో తొలిసారిగా కలిసి ఆతిథ్యం స్వీకరించిన సందర్భంగా బీసీ రాజకీయాల భవిష్యత్తు, ఉద్యమ దిశపై విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా తెలంగాణ బీసీ రాజ్యాధికార సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు ఎర్ర స్వాతి శ్రీహరి గౌడ్ వారిని ఘనంగా సన్మానించారు.
బీసీల రాజకీయ సాధికారత కోసం వారు చేస్తున్న కృషిని అభినందిస్తూ, ఉద్యమ కార్యకలాపాలకు తన వంతు సహకారంగా నగదు బహుకరించారు. బీసీలకు రాజకీయంగా సముచిత ప్రాధాన్యం కల్పించే దిశగా ఐక్యంగా పనిచేయాలని, ఉద్యమాన్ని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా నాయకులు అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో పలువురు బీసీ ఉద్యమ నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.






