29 August, 2026 | 12:37 PM

Breaking News

ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపనకు భూమి పూజ   •   పెంజర్లలో అభివృద్ధి, పారిశుద్ధ్య పనులను పరిశీలించిన అదనపు కలెక్టర్   •   స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే పోచారం   •   ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించిన కాంగ్రెస్ నాయకులు   •   క్రీడలతో యువతలో ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ పెంపొందుతుంది   •   మహానగరంలో గంజాయి చాక్లెట్ల కలకలం.. 5 వేలకు పైగా సీజ్   •   కుల గణన శాస్త్రీయంగా జరగాలి   •   మంత్రి పర్యటనకు చురుకుగా ఏర్పాట్లు   •   45వ సబ్ జూనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‎ను ప్రారంభం   •   బాలల హక్కులపై అవగాహన.. ఇబ్బందులు ఉంటే ఫోన్ కాల్ తో పరిష్కారం   •  

నాగోల్‌లో నూతన స్కేటింగ్ గ్రౌండ్ ప్రారంభం

13-07-2026 12:00 AM

ఆనంద్‌నగర్‌లో ప్రారంభించిన మాజీ కార్పొరేటర్ చింతల అరుణా సురేందర్ యాదవ్

నాగోల్, జూలై 12 (విజయక్రాంతి): నాగోల్ డివిజన్ పరిధిలోని బండ్లగూడ ఆనంద్నగర్లో నూతనంగా ఏర్పాటు చేసిన స్కేటింగ్ గ్రౌండ్ను తాజా మాజీ కార్పొరేటర్ చింతల అరుణా సురేందర్ యాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, క్రీడలు యువతలో శారీరక దృఢత్వంతో పాటు క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, పోటీతత్వాన్ని పెంపొందిస్తాయని అన్నారు. ఇలాంటి క్రీడా వేదికలు యువతలోని ప్రతిభను వెలికితీసి రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించే అవకాశాలను కల్పిస్తాయని పేర్కొన్నారు.

స్థానిక యువత ఈ స్కేటింగ్ గ్రౌండ్ను సద్వినియోగం చేసుకొని క్రీడల్లో ఉన్నత విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. క్రీడల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో క్రాస్ స్కేటింగ్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ కన్నబోయిన యాదయ్య, డైరెక్టర్ బందారం సాయి ప్రసాద్, క్రీడాకారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, కాలనీ పెద్దలు, యువకులు, మహిళలు,  పాల్గొన్నారు.