‘జలసిరి’ గ్రామసభలో సమస్యలపై చర్చ
మల్లాపూర్, ఆగస్టు 6 (విజయక్రాంతి): మల్లాపూర్ మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో గురువారం ‘జలసిరి’ గ్రామ సభ మేజర్ గ్రామ పంచాయతీ స ర్పంచ్ చిట్యాల లక్ష్మణ్ అధ్యక్షతన నిర్వహించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ, తెలంగాణ ప్ర భుత్వం భూగర్భ జలాల పెంపు, వర్షపు నీటి సంరక్షణ లక్ష్యంగా ’జలసిరి’ కార్యక్రమాన్ని అమలు చేస్తోందని తెలిపారు.
ప్రతి నీటి చుక్కను సంరక్షించడం, వర్షపు నీరు వృథా కాకుండా భూమిలోకి ఇంకేలా చర్యలు తీసుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు.ఇంకుడు గుంతల నిర్మా ణం, ప్రతి ఇంటి వద్ద, పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాల్లో సోక్పిట్లు ఏర్పాటు, కమ్యూనిటీ సో క్పిట్లు, పంట కుంటలు, ఊట కుంటల నిర్మాణం ద్వారా భూగర్భ జలాలను పెంపొందించవచ్చని వివరించారు.సామాజిక కార్యకర్త ఏనుగు వెంకట్ రెడ్డి (ఏ.వీ.ఆర్) గ్రామంలో మంచినీటి బావుల చుట్టూ రక్షణ కంచె ఏర్పాటు చేయాలని, కోరారు.
అలాగే గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో వైకుంఠ రథాన్ని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ గ డ్డం సోమరెడ్డి, గ్రామ కార్యదర్శి గూరుడు శ్రీనివాస్, విద్యుత్ ఏఈ వినీత్ రెడ్డి, పోలీసు సిబ్బంది, జీపీఓ జల, సీనియర్ అసిస్టెంట్ మనోహర్ రెడ్డి, వార్డు సభ్యులు ఏనుగు లక్ష్మి, కొంపెల్లి రాకేష్, ముత్యాల గంగారాజం, అరికుప్పల రాజం, మహమ్మద్ షబ్బీర్, , పాల్గొన్నారు.






