calender_icon.png 14 August, 2025 | 12:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దివికేగిన ‘దిషోమ్ గురూ’

10-08-2025 12:32:22 AM

దిషోమ్ గురూ, జార్ఖండ్ కురువృద్ధుడు శిబూ సోరెన్ (81) మూత్రపిండాల సమస్యతో మనల్ని విడిచి వెళ్లారు. సంతాల్ కమ్యూనిటీకి చెందిన సోరెన్ జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం)ను స్థాపించి ప్రత్యేక జార్ఖండ్ పోరాటంతో కీలక నేతగా ఎదిగారు.

ముచ్చటగా మూడు సార్లు జార్ఖండ్ ముఖ్యమంత్రిగా సేవలందించిన సోరెన్, కేంద్రమంత్రిగా కూడా పని చేశారు. ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్న సోరెన్ జీ రాజకీయ జీవితంలో కుదుపులు అనేకం. సామాన్య కుటుంబంలో పుట్టిన సోరెన్.. దేశరాజకీయాలను శాసించే స్థాయికి ఎదగడం నిజంగా గొప్ప విషయం. సెల్యూట్ సోరెన్ జీ..