10-08-2025 12:30:58 AM
ప్రస్తుత రోజుల్లో పెద్ద, పెద్ద స్టార్లకు కూడా సాధ్యం కాని 100 కోట్ల బాక్సాఫీస్ కలెక్షన్లను ఓ బొమ్మల సైన్మా (యానిమేషన్ ఫిల్మ్) సాధించింది. ఈ ఘనత సాధించడంలో డైరెక్టర్ అశ్విన్ కుమార్‌ది కీలక పాత్ర. దేశంలో అత్యధిక కలెక్షన్లు సాధించిన బొమ్మల సినిమాగా ‘మహావతార్’ని నిలిపి దేశం మొత్తం తన వైపు చూసేలా, తన గురించే మాట్లాడేలా చేశాడు. ఎంబీఏ పూర్తి చేసిన అశ్విన్ అసలు పేరు అశ్విన్ కుమార్ బలోజా. హర్యానాలో పుట్టిన అశ్విన్ దేశ రాజధాని ఢిల్లీలో పెరిగారు.