calender_icon.png 26 May, 2025 | 3:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ హాస్పిటల్ ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్

25-05-2025 08:41:57 PM

మెరుగైన వైద్య సేవలు అందించి ప్రజారోగ్యాన్ని పరిరక్షించాలి

మనోహరాబాద్ (విజయక్రాంతి): ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు అందించి ప్రజారోగ్యాన్ని పరిరక్షించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్(District Collector Rahul Raj) పేర్కొన్నారు. ఆదివారం మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం ప్రభుత్వ ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సందర్శించి, ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని పలు విభాగాలను కలియ తిరుగుతూ ఒక్కో విభాగం పనితీరును పరిశీలించి, వైద్యులకు తగిన సూచనలు చేశారు. పీహెచ్ సీలోని హాజరు పట్టికను తెప్పించుకుని పరిశీలించారు. ప్రతి రోజు ఇన్ పేషెంట్లు అవుట్ పేషెంట్లు ఎంతమంది వస్తున్నారు. మందులు అందుబాటులో ఉన్నాయా తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. 

అనంతరం రోగులతో మాట్లాడి వైద్య సేవలపై ఆరా తీశారు. నిరంతరం వైద్యసేవలు అందుతున్నాయని రోగులు చెప్పడంతో ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. వైద్యులు, సిబ్బంది విధులకు సమయానికి రావాలని ఆదేశించారు. రోగులకు నిత్యం అందుబాటులో ఉండాలని, వివిధ రోగాలతో ఆసుపత్రికి వచ్చే రోగులకు వైద్యులు, సిబ్బంది మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు, ఆసుపత్రి లోపల, పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలన్నారు. దవాఖానాలో చికిత్స పొందుతున్న రోగులను ఆప్యాయంగా పలకరిస్తూ, వసతులు ఎలా ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు. అయన వెంట ఆసుపత్రి సిబ్బంది తదితరులు ఉన్నారు.