ఫీజుల డిస్‌ప్లే తప్పనిసరి!
- ఫీజు స్ట్రక్చర్‌ను విద్యాశాఖ పోర్ట్‌లో అప్‌లోడ్ చేయాలి
- తరగతుల వారీగా ఫీజు వివరాలు నోటీస్ బోర్డులో పెట్టాలి
- ప్రైవేట్ స్కూల్ ఫీజుల నియంత్రణపై కీలక అడుగు
- ఉత్తర్వులు జారీ చేసిన పాఠశాల విద్యాశాఖ
హైదరాబాద్, ఆగస్టు 7 (విజయక్రాంతి): తెలంగాణలోని ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజుల నియంత్రణ, ఆర్థిక పారదర్శకతను పెంచేందుకు తెలంగాణ పాఠశాల విద్యాశాఖ కీలక ఆదేశాలు జారీచేసింది. విద్యాసంస్థల ఆర్థిక జవాబుదారీతనాన్ని నిర్ధారించడంతో పాటు తల్లిదండ్రులపై పడుతున్న ఫీజుల భారాన్ని తగ్గించడానికి కీలక ముందడుగు వేసినట్లుగా తెలుస్తోంది. రాష్ట్రంలోని అన్ని ప్రైవేట్ అన్‌ఎయిడెడ్ పాఠశాలలు ఫీజు స్ట్రక్చర్‌ను స్కూల్ ఎడ్యుకేషన్ పోర్ట్‌లో అప్‌లోడ్ చేయాలని ఆదేశించింది.
ప్రస్తుత 2026 వి ద్యాసంవత్సరానికి తరగతుల వారీగా వసూ లు చేస్తున్న ఫీజుల వివరాలను తమ పాఠశాల నోటీసు బోర్డులలోను, అధికారిక వెబ్ సైట్‌లోనూ స్పష్టంగా ప్రదర్శించాలని ఆదేశించింది. దీనితో పాటు, గత విద్యాసంవ త్స రాలకు సంబంధించిన వార్షిక పరిపాలనా నివేదికలను కూడా పొందుపర్చాలని పే ర్కొంది.
ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న జీవో నంబ ర్ 1 నిబంధనల ప్రకా రం ఏటా ఆడిట్ నివేదికలు ఇవ్వడం తప్పనిసరి అయినప్పటికీ, గతంలో దీనిపై పర్యవేక్షణ కొరవడింది. ఫీజు స్ట్రక్చర్ ప్రదర్శించని పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని ఈ మేరకు రీజినల్ జాయిం ట్ డైరెక్టర్లు, డీఈవోలకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికో లస్ ఆదేశాలు జారీ చేశారు. భవిష్యత్తులో ఫీజుల విచ్చలవిడి పెంపును అరికట్టేందుకు కొత్త చట్టాన్ని కూ డా తీసుకొచ్చే యోచనలో ఉంది.






