8 August, 2026 | 1:51 AM

ప్రీ-ప్రైమరీ విద్యను మరింత బలోపేతం చేయాలి

08-08-2026 12:34 AM

జిల్లా కలెక్టర్ కె. హారిత

కుమ్రం భీం ఆసిఫాబాద్, ఆగస్టు 7 (విజయక్రాంతి): చిన్నారులకు ఆటపాటలు, కథలు, చిత్రలేఖనం, వివిధ సృజనాత్మక కార్యకలాపాల ద్వారా ఆనందదాయకమైన అభ్యసన వాతావరణం కల్పించి ప్రీ-ప్రైమరీ విద్యను మరింత బలోపేతం చేయాలని జిల్లా కలెక్టర్ కె. హారిత అన్నారు.

జిల్లా కేంద్రంలోని తెలంగాణ మోడల్ స్కూల్లో ప్రీ-ప్రైమరీ సెక్షన్లు నిర్వహిస్తున్న పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు శుక్రవారం నిర్వహించిన జిల్లాస్థాయి శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. చిన్నారి తొలి విద్యా భ్యాస దశే భవిష్యత్ విద్యకు పునాదిగా నిలుస్తుందని, ఈ దశలో చదువు ఒత్తిడి లేకుండా పిల్లలు ఆనందంగా నేర్చుకునే అవకాశాలు కల్పించాలని సూచించారు.

పిల్లలు పాఠశాలకు రావాలనే ఆసక్తి పెరిగేలా సురక్షితమైన, పరిశుభ్రమైన, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ప్రతి పాఠశాలలో ఏర్పాటు చేయాలని, ప్రతి చిన్నారి వయస్సు, ఆసక్తి, అభ్యసన స్థాయికి అనుగుణంగా బోధన ఉండాలని కలెక్టర్ తెలిపారు. భాషా నైపుణ్యాలు, సంఖ్యా భావనలు, పరిశీలన, ఆలోచనా శక్తి, సృజనాత్మకత, సామాజిక నైపుణ్యాల అభివృద్ధికి ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యా యులకు సమర్థవంతమైన మార్గదర్శకత్వం అందించాలని సూచించారు.

ఇండోర్, అవుట్డోర్ ఆట వస్తువులు, టీఎల్‌ఎం, చిత్రాలు, బొమ్మలు, కథా పుస్తకాలు వంటి వనరులను సమర్థంగా వినియోగించి అనుభ వపూర్వక అభ్యసన అందించాలని, పిల్లల భద్రత, పరిశుభ్రత, తాగునీరు, మరుగుదొడ్లు, తరగతి గది వాతావరణంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని పేర్కొన్నారు.ప్రధానోపాధ్యాయులు పరిపాలనా బాధ్యతలతో పాటు ప్రీ-ప్రైమరీ తరగతుల అకాడమిక్ మానిటరింగ్, మెంటరి్ంప దృష్టి సారించి తరగతి గదులను క్రమం తప్పకుండా సందర్శించాలని సూచించారు.

‘పాఠశాలలో చిన్నారి పొందే తొలి అనుభవమే అతని విద్యా ప్రయాణాన్ని ప్రభావితం చేస్తుంది. అందువల్ల ప్రతి ప్రీ-ప్రైమరీ తరగతి గదిని పిల్లలు ప్రతిరోజూ ఆనందంగా రావాలనుకునే ప్రదేశంగా తీర్చిదిద్దాలి అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి సచ్చిదానంద చారి, జిల్లా అకాడమిక్ మానిటరింగ్ అధికారి ఉప్పులేటి శ్రీనివాస్, తెలంగాణ మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ మహేశ్వర్, రిసోర్స్ పర్సన్లు శంకర్, ఝాన్సీ, వెంకటేష్, ప్రీ-ప్రైమరీ సెక్షన్లు నిర్వహిస్తున్న పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.