సీఎంవోకు చేరిన డిగ్రీ కోర్సుల పంచాయితీ
27-05-2026 12:06 AM
హైదరాబాద్, మే 26 (విజయక్రాంతి): డిగ్రీ విద్యలో ఇద్దరు అధికారుల మధ్య నెలకొన్న కొత్త కోర్సుల పంచాయితీ సీఎంవోకు చేరింది. మంగళవారం వచ్చిన వార్త కథనాల నేపథ్యంలో సీఎంవో ముఖ్య కార్యదర్శి శేషాద్రి ఆరా తీసినట్లు తెలిసింది. ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ వి.బాలకిష్టారెడ్డితో శేషాద్రి సమావేశమై వివాదానికి గల వివరాలు అడిగి తెలుసుకున్నట్లు తెలిసింది.
ఉన్నత విద్యామండలి ఎమర్జింగ్ కోర్సుల పేరిట నాన్ అప్రెంటిస్‌షిప్ కోర్సులను ప్రవేశపెట్టేందుకు చర్యలు చేపట్టింది. అయితే ఈ కోర్సులకు యూనివర్సిటీల అనుమతులు లేవని కళాశాల విద్యాశాఖ కమిషనరేట్ చెబుతుండగా, ఏవో చిన్న కారణాలను చూపి డిమాండ్ ఉన్న కోర్సులకు అనుమతులు ఇవ్వడంలేదని ఉన్నతవిద్యామండలి చెబుతోంది. అటు ప్రభుత్వం సీరియస్ అయినట్లుగా తెలిసింది.






