20 May, 2026 | 2:42 AM

అక్రిడిటేషన్ కార్డులు పంపిణీ

20-05-2026 01:28 AM

కామారెడ్డి, మే 19 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లాలో అర్హులైన జర్నలిస్టులకు 20262028 సంవత్సరానికి సంబంధించి మంజూరైన  మీడియా అక్రిడిటేషన్ కార్డులను జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ ఛైర్మన్, జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్,  అదనపు కలెక్టర్ విక్టర్ తో కలిసి అక్రిడేషన్ కార్డులను పంపిణీ చేశారు. 

జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ సభ్యులకు అక్రిడేషన్ కార్డులను అందించి నూతన అక్రిడిటేషన్ కార్డుల జారీ ప్రక్రియను ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఆశిష్ సంగు వాన్ ను అక్రిడేషన్ కమిటీ సభ్యులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా  పౌర సంబంధాల అధికారిణి, కన్వీనర్ బి.తిరుమల, మీడియా అక్రిడిటేషన్ కమిటీ సభ్యులు రజనీకాంత్, ఉక్కల్ కర్ రాజేందర్ నాథ్, సయ్యద్ కౌసర్ అలీ,  పాత్రికేయ మిత్రులు హరీష్, శ్రీనివాస్ లు తదితరులు పాల్గొన్నారు.