సీపీఎస్ రిటైర్డ్ ఉద్యోగుల డేటాను సేకరించాలి
20-05-2026 01:28 AM
సీపీఎస్ ఉద్యోగుల యూనియన్
హైదరాబాద్, మే 19 (విజయక్రాంతి): కొత్త ఈహెచ్‌ఎస్‌లో కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం రిటైర్డ్ ఉద్యోగుల వివరాలను కూడా సేకరించాలని తెలంగాణ రాష్ట్ర కాంట్రి బ్యూటరీ పెన్షన్ స్కీం ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు స్థితప్రజ్ఞ డిమాండ్ చేశారు. ప్రాన్ ఐడీ ద్వారా వారి వివరాలు సైతం నమోదు చేయాలని ప్రభుత్వాన్ని మంగళవారం ఒక ప్రకటనలో కోరారు. సీపీఎస్ పరిధిలోని రిటైర్డ్ ఉద్యోగులు డీడీవోల దగ్గర తమ వివరాలను నమోదు చేయించుకోవాలని ఆయన సూచించారు.






