13 April, 2026 | 1:31 PM

Breaking News

దశాబ్దాల నిరీక్షణకు ముగింపు— మహిళా రిజర్వేషన్ల చట్టంపై ప్రధాని మోదీ   •   వివాహ వేడుకలో తీవ్రవిషాదం— బస్సు, ట్రక్కు ఢీ: ఆరుగురు మృతి   •   మండల ప్రజల సమస్యలు త్వరితగతిన పరిష్కరించండి   •   నోయిడా కార్మికుల నిరసన హింసాత్మకం... వాహనాలకు నిప్పు   •   గ్రామీణ వైద్యులకు షోకాజ్ నోటీసులు జారీ   •   నెట్‌వర్కింగ్ మార్కెటింగ్ ఒత్తిడి: యువకుడి ఆత్మహత్య   •   బాణసంచా కర్మాగారంలో భారీ పేలుడు; కార్మికులు చిక్కుకున్నట్లు అనుమానం?   •   గుజరాత్‌లో భయానక ప్రమాదం! యాత్రికులపైకి ట్రక్కు దూసుకెళ్లి 7 మృతి – అసలు ఏమైంది?   •   కొల్కూర్ గ్రామంలో తొలిసారి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహణ   •   ఇంటర్ ఫలితాల్లో రిషి విద్యార్థుల ర్యాంకుల పంట   •  

టెన్త్ విద్యార్థులకు ఆల్ ఇన్ వన్ పుస్తకాల పంపిణీ

19-02-2026 01:27 AM

భీమదేవరపల్లి, ఫిబ్రవరి 18 (విజయక్రాంతి): హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి లోని ఎస్సీ, బీసీ హాస్టల్ విద్యార్థులకు గ్రామ సర్పంచ్ మాచర్ల కుమారస్వామి అల్ ఇన్ వన్ పుస్తకాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వం నుండి వచ్చే సదుపాయాలు సరిగా అందుతున్నాయా లే దా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.

ప్రతిరోజు ఉదయం గ్రంథాలయాన్ని సందర్శించి పుస్తక పఠనం అలవాటు చేసుకోవాలని విద్యార్థులకు సూచించారు. పదో తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు. పదో తరగతి పరీక్ష వి ద్యార్థి దశకు కీలక మలుపు అని, చక్కగా చదువుకొని మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ శనిగరం ఐలయ్య, బీసీ హాస్టల్ వా ర్డెన్ వీరన్న నాయక్, ఎస్సీ హాస్టల్ వార్డెన్ సంపత్, బొల్లంపల్లి శ్యామ్, పాల్గొన్నారు.