20-11-2025 02:26:11 PM
నాగర్ కర్నూల్ (విజయక్రాంతి): నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం కూచుకుళ్ళ ఫౌండేషన్ తరఫున విద్యార్థులు, వికలాంగులకు సహాయ సామగ్రిని పంపిణీ చేశారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న వివిధ ప్రభుత్వ పాఠశాలలకు 100 గ్రీన్ బోర్డ్స్, వికలాంగులకు ట్రైసైకిళ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సతీమణి డా. కూచుకుళ్ళ సరిత పాల్గొని సహాయ సామగ్రిని అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడం ఫౌండేషన్ ప్రధాన లక్ష్యమని, భవిష్యత్తులో మరిన్ని సామాజిక కార్యక్రమాలను చేపడతామన్నారు. కార్యక్రమంలో పట్టణ మాజీ కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.