20-11-2025 04:15:40 PM
బెల్లంపల్లి (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని సరస్వతి శిశుమందిర్ రోడ్డు వెడల్పు పనులను గురువారం మున్సిపల్ అధికారులు ప్రారంభించారు. పాత బస్టాండ్ ప్రాంతంలో రోడ్డుపై రాకపోకలు నిలిపివేసి జెసిబిల సహాయంతో రోడ్డుపై ఉన్న దుకాణ సముదాయాలతో పాటు, ఇళ్ల నిర్మాణాలను తొలగించారు. రోడ్డుకు రెండు వైపులా 30 ఫీట్లతో రోడ్డు వెడల్పు చేసేందుకు నిర్ణయించారు. రోడ్డు వెడల్పు పనులను ఎవరు అడ్డుకోకుండా బెల్లంపల్లి వన్ టౌన్ సిఐ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ప్రజల బందోబస్తు ఏర్పాటు చేసి రోడ్డు వెడల్పు పనులు చేపడుతున్నారు. రోడ్డు వెడల్పు పనులతో రెండు వైపులా ఇళ్లను కోల్పోతుండడంతో బస్తీ వాసులు తీవ్ర ఆందోళన కు గురవుతున్నారు.