calender_icon.png 20 November, 2025 | 4:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థులకు స్టడీ చైర్స్ బహుకరణ

20-11-2025 02:27:53 PM

మఠంపల్లి: మఠంపల్లి మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అల్లీపురంలో  చదువుతున్న 10 వ తరగతి విద్యార్థులకు రాధికా రైస్ ఇండస్ట్రీ యాజమాని కొమ్మనబోయిన లక్ష్మినారాయణ విద్యార్థులకు స్టడీ చైర్స్, ఉపాధ్యాయులకు కూర్చిలు బహుకరించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు మంచి క్రమశిక్షణతో విద్య బుద్ధులు అలవర్చుకోవాలని,ఒక లక్ష్యంతో చదువుకోవాలని కోరారు. ప్రధానోపాధ్యాయులు శేషి రెడ్డి మాట్లాడుతూ... విద్యార్థులు ప్రతిరోజు ఉదయం,సాయంత్రం స్టడీ అవర్ సమయంలో ఎక్కువ సమయం నేలపైన కింద కూర్చుని చదువుకోవటం ఇబ్బందిగా ఉన్న సమయంలో మేము సహాయం కోసం సంప్రదించిందిన వెంటనే రాధిక రైస్ ఇండస్ట్రీస్ యజమాని  స్పందించి విద్యార్థులకు స్టడీ చైర్లు12, ప్లాంకులు12, ఉపాధ్యాయుల కొరకు చైర్లు10 అందించారని తెలిపారు.స్టడీ అవర్ నిర్వహణ సౌకర్యం కోసం పాఠశాల విద్యార్థులకు చేసిన సహాయం చాలా విలువైనదని తెలిపారు.ఈ సందర్భంగా దాత  కొమ్మనబోయిన లక్ష్మీ నారాయణ కు శాలువాతో సన్మానించి కుటుంబ సభ్యులకు విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు లూర్థుమరెడ్డి,సురేష్ రెడ్డి,సైదులు, లోకేష్ తదితరులు పాల్గొన్నారు.