20-11-2025 03:28:33 PM
బిసి సమాజ్ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్
మందమర్రి,(విజయక్రాంతి): బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు(BC Reservations) అమలు చేయకుండా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహిస్తే రాష్ట్ర ప్రభుత్వంపై బీసీల ఆధ్వర్యంలో యుద్ధం నిర్వహిస్తామని బీసీ సమాజ్ రాష్ట్ర కార్యదర్శి(BC Samaj State Secretary) నరేంద్ర శ్రీనివాస్ స్పష్టం చేశారు. మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణంలోని సింగరేణి హై స్కూల్ గ్రౌండ్ లో బీసీ సమాజ్ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన చాయ్ పే చర్చ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం కామారెడ్డి డిక్లరేషన్ అనుసరించి బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్ లో ప్రవేశపెట్టి రాజ్యాంగ సవరణ చేసి 42% రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాలని కోరారు.
భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన ప్పటి నుండి నేటి వరకు 130 సార్లు రాజ్యాంగ సవరణలు చేశారు. ఏ ఉద్యమం లేకుండానే అగ్రకులాలకు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 103 ను ఐదు రోజుల్లో సవరణ చేసి 10శాతం ఈడబ్ల్యూ ఎస్ రిజర్వేషన్లు కల్పించిన కేంద్ర ప్రభుత్వం 40 సంవత్సరాలుగా బీసీలకు విద్యా ఉద్యోగ స్థానిక సంస్థలు చట్టసభలలో రిజర్వేషన్లు కల్పించాలని ఉద్యమాలు చేస్తున్న బీసీలకు ప్రజాస్వామ్య బద్ధంగా వాటా ఇవ్వకపోవడం బాధాకరం అన్నారు. ఇప్పటి కైనా కేంద్ర ప్రభుత్వం బీసీల న్యాయమైన డిమాండ్ లను గుర్తించి 42 శాతం రిజర్వేషన్ల పై రాజ్యాంగ సవరణ చేసి కేంద్ర ప్రభుత్వం బీసీల పక్షాన నిలబడాలన్నారు.
లేకుంటే రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమం లో కార్మిక నాయకుడు సలేంద్ర సత్యనారాయణ, మైనార్టీ నాయకులు ఎండి ఎండి అబ్బాస్, సగర సంఘం జిల్లా అధ్యక్షులు బర్ల సదానందం, పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షులు చిలగాని సుదర్శన్, బిసి నాయకులు ఒజ్జ సాగర్ బాబు, దూడపాక రాజేందర్, శనిగారపు జనార్ధన్, బిసి సమాజ్ నాయకులు వెన్నంపల్లి రవీందర్, అంకం సాగర్, శీలం మహేందర్, చింతల పోషం, పొన్నం హరీష్, రామసాని శేఖర్, కంది తిరుపతి, నస్పూరి తిరుపతి, పిల్లి మల్లేష్, బర్ల శేఖర్, బీసీ కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు.