20-11-2025 02:29:16 PM
భయాందోళనలో విద్యార్థులు, తల్లిదండ్రులు
వలిగొండ, (విజయక్రాంతి):వలిగొండ మండలంలోని సంగెం గ్రామంలో గల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో క్షుద్ర పూజలు నిర్వహించిన సంఘటన కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే సంగెం గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో గుర్తు తెలియని వ్యక్తులు బుధవారం రాత్రి పాఠశాలలో ముగ్గు వేసి పసుపు, కుంకుమలు, నిమ్మకాయలు పెట్టి వెళ్లారు. కాగా ఉదయాన్నే పాఠశాలకు వెళ్లిన విద్యార్థులకు పాఠశాలలో క్షుద్ర పూజలు నిర్వహించినట్టు కనిపించడంతో భయాందోళనకు గురయ్యారు. విషయం తెలిసి తల్లిదండ్రులు పాఠశాలకు చేరుకొని ఆందోళన వ్యక్తం చేశారు. కాగా కొంతమంది వాటిని తొలగించి శుభ్రం చేయడం జరిగింది.