calender_icon.png 20 November, 2025 | 3:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేటీఆర్‌ను వేధిస్తున్నారు.. స్థానిక ఎన్నికల్లో లబ్ధి కోసం చిల్లర డ్రామాలు

20-11-2025 02:24:41 PM

హైదరాబాద్ బ్రాండ్ ఇమేజీని పెంచిన కేటీఆర్ పై అక్రమకేసులు.

 కేటీఆర్ పై రాజకీయకక్ష సాధింపు చర్యలకు పరాకాష్ట ఇది.

కేటీఆర్ కు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది.

హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు(Thanneeru Harish Rao) తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావుపై(BRS Working President KT Rama Rao) తప్పుడు, చట్టవిరుద్ధమైన కేసులు నమోదు చేసి, ప్రతిపక్షాల గొంతు నొక్కేస్తోందని ఆయన ఆరోపించారు. కేటీఆర్ పై రాజకీయకక్ష సాధింపు చర్యలకు ఇది పరాకాష్ట అన్నారు. ఈ ప్రభుత్వం ప్రశ్నించే వారి గొంతులు నొక్కే ప్రయత్నం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రతిపక్ష నేతలను వేధించడమే రేవంత్ రెడ్డి పనిగా పెట్టుకున్నారని ధ్వజమెత్తారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజీని(Hyderabad brand image) పెంచిన కేటీఆర్ పై  రేవంత్ రెడ్డి అక్రమ కేసులు బనాయించి ఇబ్బంది పెట్టడమే లక్ష్యంగా పెట్టుకున్నారని తెలిపారు.  ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ఎండగడుతున్న కేటీఆర్‌ పై అక్రమ కేసులు బనాయించి రాక్షసానందం పొందటం అప్రజాస్వామికం అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల వేళ రాజకీయ లబ్ది పొందేందుకు చేస్తున్న చిల్లర డ్రామాలను ప్రజలు గమనిస్తున్నారని హెచ్చరించారు.

అక్రమ కేసులతో కేటీఆర్, బీఆర్ఎస్ పార్టీ నాయకుల మనోస్థైర్యాన్ని దెబ్బతీయలేరని తేల్చిచెప్పారు. కేటీఆర్ కు బీఆర్ఎస్ పార్టీ పూర్తి అండగా ఉంటుందన్న హరీశ్ రావు రేవంత్ రెడ్డి దుర్మార్గ వైఖరిని న్యాయపరంగా ఎదుర్కొంటామని తెలిపారు. ఈ-కార్ రేసింగ్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ ప్రాసిక్యూషన్ కు ఏసీబీకి తెలంగాణ గవర్నర్ అనుమతించిన విషయం తెలిసిందే. రూ,. 54.88 కోట్ల నిధుల దుర్వినియోగం కేసులో కేటీఆర్ ను ఏసీబీ విచారించనుంది. కేటీఆర్ పాత్రపై సాక్షాలు ఉన్నాయంటూ ప్రాసిక్యూషన్ కు ఏసీబీ గవర్నర్ ను కోరింది. ఈ కార్ రేసింగ్ కేసులో త్వరలోనే ఏసీబీ ఛార్జిషీట్ దాఖలు చేయనుంది.