calender_icon.png 2 May, 2025 | 5:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యువతకు సైకిళ్ల పంపిణీ

02-05-2025 12:22:45 AM

సూర్యాపేట, మే 1 (విజయక్రాంతి): ఈనెల 27న వరంగల్ ఎల్కతుర్తిలో కనీవినీ ఎరుగని రీతిలో జరిగిన BRS రజతోత్సవ మహాసభ కు సూర్యాపేట జిల్లా కేంద్రం నుంచి మాజీమంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి సారధ్యంలో కొనసాగిన సైకిల్ యాత్ర విజయవంతగా ముగిసింది. ఈ సందర్భంగా జరిగిన యాత్రలో వెన్న రవితేజ రెడ్డి సహకారంతో ఉపయోగించిన సైకిళ్లను యాత్రలో పాల్గొన్న యువకులకు మాజీ మంత్రి స్థానిక ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి చేతుల మీదుగా గురువారం క్యాంపు కార్యాలయంలో పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా యాత్రలో పాల్గొన్న యువకులతో పాటు వారికి సహకారం అందించిన వెన్న రవితేజ రెడ్డి, గాలి సాయి, చల్లా లక్ష్మికాంత్ లను మాజీమంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అభినందించారు.