calender_icon.png 2 May, 2025 | 5:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చెప్పేది సక్రమం.. చేసేది అక్రమం..!

02-05-2025 12:20:53 AM

  1. అక్రమ ఇసుక రవాణా వెనుక అసలు కథానాయకులు ఎవరు..?

ఒక్క టోకెన్ మీద పదుల సంఖ్యలో తరలింపు అంటూ నిలదీత 

పార్టీలకతీతంగా ప్రజలు, నాయకుల ఆందోళన 

ఇసుక తరలింపుకు దారి ఇవ్వమంటున్న రైతులు 

ప్రశ్నిస్తే పోలీసులు బెదిరిస్తుండ్రు 

ధర్నాలో అఖిల పక్షం నాయకులు

మహబూబ్ నగర్ మే 1 (విజయ క్రాంతి) : చెప్పేది ప్రతి పనిని పారదర్శకంగా ముం దుకు తీసుకుపోతున్నాం.. సక్రమంగా చేస్తు న్నాం... చేసే అక్రమ పనులకు శ్రీకారం చుట్టి సక్రమం అంటూ చాటి చెబుతున్నారు... ఇది ఎక్కడి పద్ధతి అంటూ మిడ్జిల్ మండల పరిధిలో అఖిలపక్ష నాయకులు ఆందోళన చేస్తున్నారు. ఇందుకు ప్రత్యేక కారణాలు లేకపోలేదు. అక్రమంగా ఇసుక తరలిస్తున్నారని ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.

గత నాలుగు రోజుల నుంచి అఖిలపక్ష నాయకులు కొత్తపల్లి సమీపంలో నుంచి వాగులో నుంచి ఇసుక తరలిస్తున్నారని రైతుల పొలా ల నుంచి బాటలు చేసుకొని దాదాపు 50 భారత్ బెంజ్ వాహనాలతో పాటు టిప్పర్లు ద్వారా ఇసుక తరలిస్తున్నారని ఆ మండల వాసులు ఆశానం వ్యక్తం చేస్తున్నారు.

టీఎస్‌ఎండిసి ద్వారా అనుమతులు తీసుకున్నప్ప టికీ ఒకే టోకెన్ నెంబర్లు పదుల సంఖ్యలో బండ్లు నడుస్తున్నాయని ఆ ప్రాంత వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నియంత్రించాల్సిన అధికారులు ఆ దిశగా ప్రయత్నాలు చేయడం లేదని అసహనం వ్యక్తం చేస్తుండ్రు. 

అసలు ఏం జరుగుతోంది..

ఈ ప్రాంతంలో ఉన్న దుద్దింబి వాగు లో వేలాది టన్నుల ఇసుక అందుబాటులో ఉంటుంది. కొంచెం రైతులు దారి ఇస్తే చాలు... రాత్రికి రాత్రే.. పగటికి పగలే ఇసుక తరలింపు సులభంగానే ఉంటుంది.. ఈ ఇసుక అక్రమ రవాణా వెనక కథానాయకుడు ఎవరున్నారో తెలియదు కానీ... టిఎస్‌ఎండిసి ద్వారా అనుమతులు పొంది ఒకే టోకెన్ నెంబర్ మీదుగా ప్రజల సంఖ్య లో వాహనాలు ఇక్కడి నుంచి తరలిస్తున్నాయని రైతులు గట్టిగా చెబుతున్నారు. దాదాపుగా 50 భారీ వాహనాలు రోజు 200 నుంచి 300 ట్రిప్పులకు ఇసుక తరలింపు జరుగుతుందని తెలుస్తుంది.

కొత్తపల్లి సమీపంలోని దొడ్డి వాగులో గతంలో సర్వేనెంబర్ 97 లో అనుమతులు ఇచ్చినప్పటికీ ఆ ప్రాంతంలో ప్రభుత్వ భూమి కావడంతో హైదరాబాద్ లో నివాసం ఉంటున్న ఓ వ్యక్తి పేరు పై ఉన్న భూమిలో ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయని ఆ ప్రాంతవాసు లు చెబుతున్నారు. ఇసుక తరలింపుకు రైతు లగ్నములు వినియోగిస్తున్నారని, మా భూముల మీదుగా ఇసుక తరలింపు చేయకూడదని రైతులు నిరసన వ్యక్తం చేస్తున్నారు.

నియంత్రించాల్సిన అధికారులు ఆ దిశగా ప్రయత్నాలు చేయడం లేదని ప్రభుత్వా నికి చెల్లించాల్సిన డబ్బులను చెల్లించకుండానే అక్రమంగా ఇసుక తరలిస్తున్నారని ఇది ఎంతవరకు సమంజసం అంటూ ఆ ప్రాంతవాసులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

దీనికి తోడు సమీపంలో ఉన్న వాగు లో పూర్తిగా ఇసుకతవ్వడం ద్వారా భూగర్భ జలాలు అడుగంటి పోతాయని ఆసనం వ్యక్తం చేస్తుండ్రు. పలుమార్లు తాసిల్దార్ కార్యాలయం తో పాటు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసిన ఎలాంటి ఉప యోగం లేకపోవడంతో అఖిలపక్షం నాయకులు గత నాలుగు రోజులుగా ఇసుక తర లింపు ప్రక్రియ నిలిపివేయాలని ధర్నా చేస్తుండ్రు. 

అధికారులు స్పందించాల్సిందే.....

మా ప్రాంతంలో ఇసుక తీయరాదు అని మొరపెట్టుకుంటున్న అధికారులు ఎందుకు స్పందించడం లేదు. అత్యధికంగా ఇసుక తరలింపు చేయడం ద్వారా భూగర్భ జలాలు నిర్వీర్యమయ్య పరిస్థితి ఉంటుందని ఆందోళన వ్యక్తీస్తున్న అండగా నిలబడే వారే కరువయ్యారు.

ఎన్నికల్లో వచ్చినప్పుడు మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చి ఆపై మా సమస్యలను విడచివను పెడితే మా బాధలు ఎవరు చెప్పుకోవాలని అఖిలపక్ష నాయకులు ధర్నాలు పేర్కొంటున్నారు. అక్రమంగా తరలిస్తున్న ఇసుకను పూర్తిగా నిలిపి వేసే వరకు తమ ఆందోళన ఆగదని ఆగ్రహం వ్యక్తం చేస్తుర్రు. ఈ విషయంపై అధికారులు ఎంత మెరుగు స్పందిస్తారో చూడాలి. 

ఇదెక్కటి న్యాయం...

ఎవరో అక్రమాలు చేపడితే అధికారుల దృష్టికి తీసుకుపోతాం... అధికారుల అండదండలతోనే అక్రమాలు జరిగితే మా బాధ ఎవరికి చెప్పుకోవాలి. రైతుల పొలాల మీదుగా ఇష్టనుసారంగా పెద్దపెద్ద వాహనాలలో నిబంధనలకు మించి ఇసుక తరలిస్తున్న ఎవరు పట్టించుకోవడం లేదు. అధికారులకు చెప్పిన స్పందన లేదు. మరి ఎవరికి చెప్పుకోవాలి. ఎందుకింత నిర్లక్ష్యం.

వ్యక్తిగత లాభా ల కోసం మేము ధర్నా చేయడం లేదు. భవిష్యత్తు తరాలు బాగుండాలని సంకల్పంతోనే ఇసుక తరలింపు నిలిపివేయాలని కోరుతున్నాం. మా బాధను మా ఆలోచనలను పరిగణలోకి తీసుకొని ఇసుక తరలింపును పూర్తిగా నిలిపివేయాలని కోరుతున్నాం. ఇసుక తరలింపు ఆపకపోతే తమ ఆందోళన యధావిధిగా కొనసాగిస్తాం. 

    సుదర్శన్, మిడ్జిల్ మండలం, మహబూబ్ నగర్ జిల్లా