02-05-2025 12:23:09 AM
-అంబేద్కర్, పూలే భవనాలు పునాదులకే పరిమితం
-నిధులు ఉన్నా ముందుకు సాగని పనులు
-డంప్‌యార్డులను తలపిస్తున్న నిర్మాణ ప్రాంతాలు
హుజూరాబాద్, మే 1: ‘అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని’ అన్న చందాన ఉంది జిల్లాలోని పలు ప్రాంతాల్లో చేపట్టిన కమ్యూనిటీ భవనాల పరిస్థితి. నిర్మాణ పనులకు ప్రభుత్వం నిధులు కేటాయించినా ఏళ్లుగా పునాదులకే పరిమితం కావడంతో ఆయా ప్రాంతాలు డంప్‌యార్డులను తలపిస్తున్నాయి.
ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం కరీం నగర్ జిల్లాలోని హుజూరాబాద్‌లో చేపట్టిన అంబేద్కర్, జ్యోతిబాపూలే భవన నిర్మాణాలు. ఈ భవనాల నిర్మాణానికి ఇప్పటికే నాలుగుసార్లు నిధులు మంజూరు చేసినా.. నేటికి నిర్మాణదశలోనే ఉండటం గమనా రం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఉపయోగకరంగా ఉండే ఈ భవన నిర్మాణానికి స్థలాన్ని కేటాయించడంతోపాటు నిధులను సైతం మంజూరు చేసినా నిర్మాణానికి మోక్షమెప్పుడు కలుగుందని స్థానికులు ప్రశ్నిస్తు న్నారు.
పోరాడి సాధించుకుని..
హుజూరాబాద్ పట్టణంలో దళితుల సంక్షేమార్థం కమ్యూనిటీ హాలు ఏర్పాటు చేయాలని దళిత, ప్రజాసంఘాలు అనేక ఆందోళన కార్యక్రమాలు చేపట్టింది. వారి దీక్షలఫలితంగా 2011లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం బస్టాండ్ సమీపంలోని సర్వే నంబర్ 2391, 2392, 2393లో 600 గజాల భూమిని కేటాయించింది. దీంతోపా టు రూ.5 లక్షల నిధులను సైతం కేటాయించింది. అప్పటి హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సైతం ఈ స్థలాన్ని పరిశీలించి అంబేద్కర్ కమ్యూనిటీ హాలు కట్టిం చేందుకు కృషిచేస్తానని హామీ ఇచ్చారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత జరిగిన ఎన్నికల్లో విజయం సాధించి ఆర్థిక, పౌరసర ఫరాల మంత్రిగా బాధ్యతలు తీసుకున్న ఈటల 2016లో రూ.9 లక్షలు, 2017లో రూ.50 లక్షల నిధులు కేటాయించారు. మరోసారి రూ.కోటి నిధులను కేటాయించారు. పనులు ప్రారంభించినప్పటికీ మధ్య లోనే నిలిచిపోయాయి. నిధులు విడుదలకు కాకపోవడం వల్లే పనులను నిలిపివేశామని కాంట్రాక్టర్ చెప్తున్నారు. ఇకనైనా కాంగ్రెస్ ప్రభుత్వం చొరవ తీసుకొని నిర్మాణం జరిగే విధంగా చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.
డంపింగ్ యార్డ్‌ను తలపిస్తున్న నిర్మాణం
కమ్యూనిటీ హాళ్ల నిర్మాణం మధ్యలోనే నిలిచిపోవడంతో సమీ ప ప్రాంతాల్లోని దుకాణాల యాజమానులు చెత్తాచెదారాన్ని కమ్యూనిటీ హాల్ నిర్మాణప్రాంతాల్లో పడేస్తున్నారు. బస్టాండ్‌కు వచ్చే ప్రయాణికులతోపాటు చుట్టుపక్కల ప్రాంతాల వారు ఈ స్థలంలో మల, మూత్ర విసర్జనలు చేస్తుండటంతో డంపింగ్ యార్డుగా మారి కంపు కొడుతుంది. సరిపడా నిధులు కేటాయించి, నిర్మా ణానికి రాష్ర్ట ప్రభుత్వం కృషిచేయాలి. బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జి ఒడితెల ప్రణవ్ చొరవ చూపాలి.
వేల్పుల ప్రభాకర్, అంబేద్కర్ భవన నిర్మాణ కమిటీ అధ్యక్షుడు