31-08-2025 07:48:28 PM
చండూరు,(విజయక్రాంతి): 1975 - 76 పూర్వ విద్యార్థులు చండూరు ఉన్నత పాఠశాలకి 20 వేలు విలువ చేసే 40 కుర్చీలు శనివారం ప్రధానోపాధ్యాయులు ఏ. కోటేశ్వర్ రెడ్డి కి అందజేశారు. పాఠశాలలో జరిగే సాంస్కృతిక కార్యక్రమాలకు, సభలు, సమావేశాలకు ఈ కుర్చీలు ఉపయోగించుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు ఐటిపాముల శ్యామసుందర్, చెరుపల్లి రమేష్, డాక్టర్ బొమ్మగాని ఆంజనేయులు, మైత్రి టైలర్స్ ప్రభాకర్, చెరుపల్లి కృష్ణయ్య, మహమూద్ టీచర్ పాల్గొన్నారు. పాఠశాల ఉపాధ్యాయులు రాపోలు యాదగిరి,కె. శ్రీనివాస్ తదితరులకు అందజేసి, ఇకముందు పాఠశాలకు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేశారు. పూర్వ విద్యార్థులకు పాఠశాల తరఫున ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయ బృందం మరియు విద్యార్థులు ధన్యవాదాలు తెలియజేశారు.