calender_icon.png 3 September, 2025 | 6:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అధికారుల ఆదేశాలు బేఖాతరు !

01-09-2025 12:07:19 AM

* సీజ్ చేసిన దాబాను తెరిచిన యాజమాన్యం

* యథేచ్ఛగా వ్యాపారం

కొండాపూర్, ఆగస్టు 31 : గ్రామ పంచాయతీ అనుమతులు లేకుండా అక్రమంగా వ్యాపారం చేస్తున్న కొం డాపూర్ మండల పరిధిలోని గిర్మాపూర్ గ్రామ శివారులో ఉన్న కింగ్స్ దాబాను శుక్రవారం జిల్లా పంచాయతీ అధికారులతో పాటు మండల పంచాయతీ అధికారులు సిజ్ చేయ గా, సీజ్ చేసిన 24 గంటలు గడవకముందే దాబా యజమాన్యం పంచాయతీ అధికారులను ఏమాత్రం లెక్కచేయకుండా దాబాను తిరిగి ప్రారంభించారు. 

దీంతో అధికారుల ఆదేశాలకు ఏ మాత్రం అక్రమార్కులకు పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. దాబా యజమానులు అనుమతులకు విరుద్దంగా వ్యాపారం నిర్వహిస్తున్నారని ఇటీవల విజయక్రాంతి ప్రచురించిన కథనానికి అధికారులు స్పందించి సీజ్ చేయడం జరిగింది. కానీ అధికారుల ఆదేశాలు బేఖాతరు చేస్తూ దాబా యాజమాన్యం యథేచ్ఛగా నడిపించడం అధికారుల పనితీరుకు నిదర్శనంగా కనిపిస్తోంది.

అయితే వ్యాపారుల వెనుక పంచాయతీ అధికారుల అండదండలు ఉన్నాయని, నామమాత్రంగా నోటీసులు జారీ చేసి చేతులు దులుపుకుంటున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఉన్నతాధికారులు ఈ విషయంలో కఠిన చర్యలు తీసు కోవాలని డిమాండ్ చేయడమే కాకుండా గిర్మాపూర్ కార్యదర్శిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.