calender_icon.png 1 September, 2025 | 12:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఎం సహాయ నిధికి బాలకృష్ణ విరాళం పట్ల హర్షం

31-08-2025 07:28:20 PM

ఇల్లందు టౌన్,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా ప్రధానంగా కామారెడ్డిలో నిరాశులయిన ప్రజల కోసం సినీ నటుడు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ రూ.50 లక్షలు విరాళం పట్ల తెలుగుదేశం పార్టీ ఇల్లందు నియోజకవర్గ కోఆర్డినేటర్ ముద్రగడ వంశీ ఇల్లందు తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి ఆదివారం హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పడిన విపత్కర పరిస్థితులలో తెలుగు ఇండస్ట్రీ సహాయ సహకారాలు అందించడానికి ముందుకు వస్తే అందులో నందమూరి బాలకృష్ణ ముందు వరుసలో ఉంటారన్నారు.

గతంలో దివిసీమ ఉప్పెన వచ్చినప్పుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు స్వర్గీయ అక్కినేని నాగేశ్వరరావు తో కలిసి దివిసీమ బాధితుల కోసం జోల పట్టి రోడ్డు పైకి వచ్చి బాధితులకు అండగా నిలిచారన్నారు. ఎన్టీఆర్ వారసత్వాన్ని కొనసాగిస్తూ రాజకీయాల్లో సినిమా రంగంలో సామాజిక సేవా రంగాల్లో నందమూరి బాలకృష్ణ తనదైన ముద్ర వేసుకున్నారని అన్నారు. అదేవిధంగా సినీ రంగంలో 50 వసంతాలు పూర్తి చేసుకున్నందుకు నందమూరి బాలకృష్ణకు శుభాకాంక్షలు తెలిపారు.