calender_icon.png 3 September, 2025 | 6:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాష్ట్రానికే ఆదర్శంగా సిద్దిపేట జిల్లా రేషన్ డీలర్ల ఎన్నికలు

01-09-2025 12:09:25 AM

రాష్ట్ర రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాయి కోటిరాజు

సిద్దిపేట కలెక్టరేట్, ఆగస్టు 31:రాష్ట్ర రేషన్ డీలర్ల అభ్యున్నతే నా లక్ష్యమని రాష్ట్ర రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాయి కోటిరాజు తెలిపారు. ఆదివారం సి ద్దిపేటలో జరిగిన జిల్లా నూతన కమిటీ అభినందన సభలో ముఖ్య అతిథిగా పాల్గొనీ మాట్లాడారు. సిద్దిపేట జిల్లా ఎన్నికలు రా ష్ట్రానికే ఆదర్శంగా నిలిచాయన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా 17,200 రేషన్ డీలర్ కుటుంబాలను సమస్యల నుండి రక్షించడం రాష్ట్ర నాయకత్వం బాధ్యతగా పేర్కొన్నారు. డీలర్ల కమిషన్ నేరుగా అ కౌంట్లలో జమ అయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, అనుకోని పరిస్థితుల్లో రేషన్ డీలర్ మృతి చెందితే వారి కుటుంబానికి రూ.10 లక్షల ఇన్సూరెన్స్ అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

అనంతరం సిద్దిపేట జిల్లా అధ్యక్షుడిగా వంగరి నాగరాజు, ప్రధాన కార్యదర్శిగా శబనా తాబుసం అజీజ్, కోశాధికారిగా జూలూరి నాగభూషణం,ఉపాధ్యక్షులుగా పాక రమే ష్, బొజ్జ నరేందర్లను ఆయన శాలువాతో సన్మానించారు.సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు వంగరి నాగరాజు మాట్లాడుతూ రాబోయే రోజుల్లో రేషన్ డీలర్ల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు సంజీవరెడ్డి, కుమార్, మురళి, దొమ్మాటి రవీందర్, పలు జిల్లాల రేషన్ డీలర్లు, మండల కమిటీ సభ్యులు పాల్గొన్నారు.