13 July, 2026 | 9:39 PM

Breaking News

ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •  

ఇంటింటికీ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ

28-03-2026 01:56 PM

బిక్కనూరు,(విజయక్రాంతి): ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) నేతృత్వంలోని ప్రభుత్వం పేదల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ బిక్కనూరు మండలంలోని రామేశ్వరపల్లి, తిప్పాపూర్ గ్రామాల్లో సీఎం సహాయ నిధి చెక్కులను ఇంటింటికీ వెళ్లి పంపిణీ చేసింది. టీపీసీసీ జనరల్ సెక్రెటరీ ఇంద్రకరణ్ రెడ్డి, గ్రంథాలయ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు భీమ్ రెడ్డి పాల్గొన్నారు.

అనారోగ్యంతో బాధపడుతున్న ఆరు కుటుంబాలకు చెక్కులు అందజేశారు. లబ్ధిదారులు ప్రమోద్ రెడ్డి (₹60,000), తిరుపతి సిద్ధమ్మ (₹60,000), నాగార్తి రమేష్ రెడ్డి (₹56,500), బాపూ రెడ్డి (₹18,000), కాశిగల్ల రాజు (₹16,000), దేవేందర్ రెడ్డి (₹16,000) సాయం పొందారు. ఈ కార్యక్రమంలో శ్రీరామ్ వెంకటేష్, రాజబాబు, సర్పంచులు లింగారెడ్డి, రాణి రాజు, ఉపసర్పంచులు జీవన్, వినోద్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేశారు.