13 July, 2026 | 9:38 PM

Breaking News

ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •  

తుంగతుర్తి లోక్‌అదాలత్‌లో ఒకటైన జంట

28-03-2026 02:00 PM

వీరమల్లు సరిత దంపతులకు అభినందన తెలిపిన జడ్జి ఎండి గౌస్ పాషా.

తుంగతుర్తి,(విజయక్రాంతి): లోక్‌అదాలత్(Lok Adalat) సాక్షిగా ఓ జంట ఒక్కటైంది. క్షణికావేశంతో కోర్టు మెట్టెక్కిన దంపతులు లోక్‌అదాలత్ సాక్షిగా ఒక్కటయ్యారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలోని జూనియర్ సివిల్ కోర్టు కోర్టు ప్రాంగణంలో జడ్జి ఎండి.గౌస్ పాషా ఆధ్వర్యంలో జరిగిన లోక్‌అదాలత్ లో తుంగతుర్తి మండలం గొట్టిపర్తి గ్రామానికి చెందిన వీరమల్లు సరిత దంపతులు 2012లో వివాహం జరిగింది. మనస్పర్ధలతో వేరువేరుగా ఉంటున్న, వాళ్ళిద్దరూ ఒక్కటి కావడంతో అందరు సంతోషం వ్యక్తం చేశారు.

కేసులు వద్దు సామరస్యంగా పరిష్కారం ముద్దు, అది లోకదాలత్తే సాధ్యపడుతుందని, జడ్జి పేర్కొన్నారు. కక్షి దారులు శనికావేశాన్ని మరిచి, ప్రతి ఒక్కరు ప్రేమ అభిమానంతో జీవించాలని కోరారు. లోక్ అదాలత్ లో విశేషణ స్పందన రావడం సంతోషంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సీఐ నరసింహారావు, ఎస్సై క్రాంతి కుమార్ చిరంజీవి, సైదులు, బార్ అసోసియేషన్ అధ్యక్షులు అనపర్తి జ్ఞాన సుందర్ ,కారంగుల వెంకటేశ్వర్లు, పర్వీన్ బేగం, రాజు, వేణు యాదవ్, సతీష్, తదితరులు పాల్గొన్నారు.