3 September, 2026 | 5:22 AM

రూ.6.97 లక్షల విలువ గల సీఎంఆర్ చెక్కుల పంపిణీ

03-09-2026 | 03:30am

బాధితులకు అండదండగా ప్రభుత్వం: ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం 

బోయినపల్లి సెప్టెంబర్ 2 (విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లాబోయినిపల్లి మండల కేంద్రానికి సంబంధించి సీఎంఆర్ ఎఫ్ కింద మంజూరైన రూ.6,97,500 విలువైన చెక్కులను చొప్పదండి నియోజకవర్గ ఎమ్మెల్యే డా. మేడిపల్లి సత్యం(MLA Dr. Medipalli Satyam) గంగాధర క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు అందించారు.

బోయినిపల్లి మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 22 మంది లబ్ధిదారులకు ఈ సీఎంఆర్ ఆర్థిక సహాయాన్ని అందించారు. ఒక్కొక్కరి అవసరానికి అనుగుణంగా మంజూరైన మొత్తాలకు సంబంధించిన చెక్కులను ఎమ్మెల్యే స్వయంగా అందజేసి, లబ్ధిదారులతో మాట్లాడారు. పేద, మధ్యతరగతి కుటుంబాలకు ప్రభుత్వం అందిస్తున్న సీఎంఆర్ ఆర్థిక సహాయం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఎమ్మెల్యే సత్యం పేర్కొన్నారు.

అనారోగ్యం, వైద్య చికిత్స వంటి అత్యవసర పరిస్థితుల్లో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందన్నారు.అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా అవసరమైన సహాయం అందేలా కృషి చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు.

సీఎంఆర్ చెక్కులు అందుకున్న లబ్ధిదారులు ఎమ్మెల్యే సత్యంకు, ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కొమ్మనబోయిన సువీన్ యాదవ్ ఏఎంసి ఛైర్మెన్ ఎల్లేష్ యాదవ్, మాజీ ఎంపీపీ పర్లపల్లి వేణు గోపాల్ ,మాడిశెట్టి మునీందర్ ,తిరుపతి రెడ్డి, పురషోతం రెడ్డి ,పులి లక్ష్మీపతి గౌడ్, సుదర్శన్, దేవయ్య, అంజయ్య, ఉపేందర్, చంద్రయ్య, రజనీకాంత్, ప్రవీణ్ ,జలేందర్,తో పాటు పలువురు పాల్గొన్నారు.