22 June, 2026 | 2:08 PM

Breaking News

డీటీవో వెంకన్న మృతి పట్ల రేవంత్ రెడ్డి దిగ్బ్రాంతి   •   రాజ్‌నాథ్‌ సింగ్‌తో CM రేవంత్ రెడ్డి భేటీ.. కీలక అంశాలపై చర్చ!   •   తరగతి గదుల్లోకి ఉపాధ్యాయుల వాహనాలు.!   •   ఎం.జి.ఎన్.ఆర్.ఈ.జి.ఎస్ నిధులతో రూ.27 లక్షల పనులకు శంకుస్థాపన   •   విద్యార్థుల్లో యోగా ప్రతిరోజు దినచర్య కావాలి   •   సంధ్యా థియేటర్ తొక్కిసలాట: కోర్టుకు హాజరుకాని అల్లు అర్జున్   •   దేశానికి చక్రవర్తులమనే భావనలో మోదీ, అమిత్ షా   •   మోడల్ స్కూల్లో మంచినీటి ఎద్దడి తీర్చిన ఎమ్మెల్యే   •   చినుకు రాలేదు.. చింత తీరదు.. అదనపు ఖర్చులతో రైతు ఇబ్బంది   •   యువత పాలమూరు గడ్డకు పేరు తేవాలి: మంత్రి వాకిటి శ్రీహరి   •  

ఇంటింటికి కాంగ్రెస్ బాకీ కార్డుల పంపిణీ

08-10-2025 04:46 PM

హాజీపూర్ (విజయక్రాంతి): ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ హామీల బాకీలను కార్డుల రూపంలో ముద్రించి ఇంటింటికి కాంగ్రెస్ బాకీ కార్డుల పేరిట బీఆర్ఎస్(BRS) నాయకులు బుధవారం నుంచి పంపిణీ ప్రారంభించారు. బీఆర్ఎస్ పార్టి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR), మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు(Nadipelli Diwakar Rao) ఆదేశాల మేరకు మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలంలోని పెద్దంపేటలో ఇంటింటికి కాంగ్రెస్ బాకీ కార్డులను పంపిణీ చేశారు. 

కాంగ్రెస్ బాకీ కార్డు నిజం.. గ్యారంటీలు అబద్దం..

కాంగ్రెస్ బాకీ కార్డు నిజమని, గ్యారంటీలు అబద్దమని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నడిపెల్లి విజిత్ కుమార్(Nadipelli Vijith Kumar) అన్నారు. ప్రజలందరు నిజం వైపు నిలబడి బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి కాంగ్రెస్ కు బుద్ది చెప్పాలన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను మరిచి ప్రజలను మోసం చేసిందన్నారు. రాష్ట్ర ప్రజలు కేసీఆర్ నాయకత్వాన్నే కోరుకుంటున్నారన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ (Ex MPP) మందపల్లి శ్రీనివాస్, పెద్దంపేట మాజీ ఎంపీటీసీ (Ex MPTC) జాడి వెంకటేష్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.