31-01-2026 12:00:00 AM
సిర్గాపూర్ జనవరి 30: సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండల పరిధిలోని కడ్పల్ గ్రామానికి చెందిన కీర్తిశేషులు చాకలి లక్ష్మణ్ పిల్లలకు మధు, వాహినికి ఎన్ టీ.టీ.డి.ఏ.టీ.ఏ సాఫ్ట్వేర్ సంస్థ డైరెక్టర్ తిప్ప రాజు ప్రసాద్ సౌజన్యంతో ఇంటి బాధ్యతలు మోసే తండ్రిని కోల్పోయిన పిల్లలకు నిత్యావసర వస్తువుల పంపిణి చేశారు. ధాత తిప్ప రాజు ప్రసాద్, చంద్ర శేఖర్ ఆచార్యకు గ్రామ పెద్దలు హృదయ పూర్వక ధ న్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పరమేశ్వర్, సొసైటీ ఛైర్మెన్ ప్రతాప్ రెడ్డి, పండరి మనోహర్ రెడ్డి, అంజయ్య తదితరులు పాల్గొన్నవారు.