calender_icon.png 31 January, 2026 | 2:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బెల్ట్ షాపులపై ఎక్సైజ్ పోలీసుల మెరుపు దాడులు

31-01-2026 12:00:00 AM

నంగునూరు,జనవరి 30: మండలంలోని గ్రామాల్లో బెల్ట్ షా పులు విచ్చలవిడిగా వెలిశాయని ‘విజయక్రాంతి’ పత్రికలో శుక్రవారం ప్రచురితమైన ‘వైన్స్ యజమానుల బెల్ట్ దందా‘ కథనానికి ఎక్సైజ్ అధికారులు తక్షణమే స్పందించారు. హుస్నాబాద్ ఎక్సైజ్ సీఐ పవన్ నేతృత్వంలోని బృందం శుక్రవారం రాంపూర్, జేపీ తండా గ్రామాల్లో ఆకస్మిక దాడులు నిర్వహించింది.

ఈ తనిఖీల్లో ఇళ్ల మ ధ్య అనధికారికంగా నిల్వ ఉంచిన 13.6 లీటర్ల మద్యం, 26 లీటర్ల బీరును స్వాధీనం చేసుకుని, ఇద్దరిపై కేసులు నమోదు చేశారు.అనుమతి లేకుండా మద్యం విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని, మండలవ్యాప్తంగా నిరంతర తనిఖీలు చేపడతామని సీఐ హెచ్చరించారు. ఈ దాడుల్లో ఎస్త్స్ర రూప, ట్రైనీ ఎస్త్స్ర మధుసూదన్ పాల్గొన్నారు. సమస్యపై స్పందించి అధికారులను పరుగులు పెట్టించిన ’విజయక్రాంతి’ పత్రికకు మండల ప్రజలు కృతజ్ఞతలు తెలుపుతూ, అన్ని గ్రామాల్లోనూ ఇలాంటి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.