31-01-2026 12:00:00 AM
చేగుంట, జనవరి 30: మాసాయిపేట మండల కేంద్రంలో జరిగిన సీఎం కప్ క్రీడా పోటీల ప్రారంభోత్సవం వివాదాస్పదమైంది. ప్రజా ప్రతినిధులు, డివిజినల్, అధికారు లు, మండల అధికారుల సమక్షంలో సర్పంచులుగా ఉన్న భార్యల స్థానంలో వారి భర్త లు వేదిక పైన హాజరై పెత్తనం చెలాయించ డం చర్చనీయాంశంగా మారింది. గత ప్ర భుత్వ హయాంలోనూ ఇదే తీరు ఉండేదని, ఇప్పుడు కూడా మార్పు రాలేదని స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మహిళా ప్ర జాప్రతినిధుల అధికారాలను భర్తలు చెలాయించడంపై మండల ప్రజలు విమర్శలు గు ప్పిస్తున్నారు, ఇప్పటికైనా అధికారులు స్పం దించి ఇలాంటి సంఘటనలు పునరావృ త్తం కాకుండా చూడాలని కోరారు.