14 April, 2026 | 5:21 PM

Breaking News

జగన్నాధపురంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు   •   రాఘవపేటలో శ్రీ మల్లికార్జున స్వామి జాతర ఉత్సవం   •   ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు   •   ప్రజలందరికీ రిజర్వేషన్ కల్పించిన ఘనత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్   •   బిజెపి ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు   •   రాజ్యాంగ ఫలాలు ప్రతి ఇంటికి చేర్చాలి   •   షాపింగ్ కాంప్లెక్స్‌కు భూమి పూజ.. కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ   •   దేశ ఔన్నత్యానికి కృషి చేసిన దార్శనికుడు డాక్టర్ అంబేద్కర్   •   లౌకిక ప్రజాస్వామ్య పరిరక్షణకై కార్మికవర్గం ఉద్యమించాలి   •   డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు   •  

ఉచిత చేప పిల్లల పంపిణీ ప్రారంభం

03-11-2025 10:07 PM

జిల్లా మత్స్యశాఖ అధికారి అవినాష్..

లక్షెట్టిపేట (విజయక్రాంతి): మండలంలోని గుల్లకోట శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులో ఈ నెల 4న జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుందని జిల్లా మత్స్యశాఖ అధికారి అవినాష్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా మత్స్యశాఖ అధికారి అవినాష్ మాట్లాడుతూ... 2025-26 సంవత్సరానికి గాను జిల్లాలో 223.93 లక్షల చేప పిల్లలను పెంచేందుకు ప్రతిపాదన సిద్ధం చేశామని తెలిపారు.

జిల్లాలోని 380 చెరువులు/రిజర్వాయర్లు ఉన్నాయని, వీటిలో 369 సీజనల్ చెరువులలో 115.65 లక్షల 35-40 మిల్లీమీటర్ల చేప పిల్లలు, 5 పేరినియల్, 6 రిజర్వాయర్లలో 108.28 లక్షల 80-100 మిల్లీమీటర్ల చేప పిల్లలను వదలడం జరుగుతుందని తెలిపారు. మంచిర్యాల నియోజకవర్గంలో 51.58 లక్షల ఉచిత చేప పిల్లలు పంపిణీ చేయడం జరుగుతుందని, స్థానిక ప్రజా ప్రతినిధులు కార్యక్రమానికి హాజరై విజయవంతం చేయాలని కోరారు.