calender_icon.png 4 November, 2025 | 5:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తేమ శాతం తగ్గిన తర్వాతనే పైరు నుండి పత్తిని తీయాలి..

03-11-2025 10:01:53 PM

జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి..

మునుగోడు (విజయక్రాంతి): పత్తి రైతులు ఎండ వచ్చిన తర్వాత పత్తిని తెంపాలని అప్పుడే తేమ ఎక్కువగా లేకుండా ఉంటుందని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. సోమవారం ఆమె నల్గొండ జిల్లా, మునుగోడు, మర్రిగూడలలో సిసిఐ ద్వారా ఏర్పాటుచేసిన పత్తి కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. సరైన తేమ శాతం 8 నుండి 12 మధ్య వచ్చిన వెంటనే సిసిఐ అధికారులు పత్తిని కొనుగోలు చేయాలని కోరారు.

రైతులు ఉదయం పూట కాకుండా ఎండ వచ్చిన తర్వాత పత్తిని తెంపాలని, ముఖ్యంగా చలికాలం ఉదయం సమయంలో మంచు వల్ల తేమ ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని, అలా కాకుండా ఎండ వచ్చిన తర్వాత పత్తిని తీసినట్లైతే తేమ తక్కువగా ఉంటుందని తెలిపారు. మిల్లులలో సరైన స్థలం ఉన్నట్లయితే ఒకటి లేదా రెండు రోజులు పత్తిని మిల్లులో ఉంచుకునేందుకు అవకాశం కల్పించాలని ఆమె మిల్లు యాజమాన్యానికి సూచించారు. మంచు కురుస్తున్నందున పత్తిని ఆరబెట్టుకొని పూర్తిగా ఎండిన తర్వాతే  కొనుగోలు కేంద్రాలను తీసుకురావాలని రైతులకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో చండూర్ ఆర్డీవో శ్రీదేవి, తాసిల్దార్ నరేష్ నేలపట్ల, సిసిఐ అధికారులు ఉన్నారు.