17 July, 2026 | 12:46 AM

ఇందిరమ్మ చీరలు పంపిణీ

17-07-2026 12:00 AM

బోర్డు మాజీ ఉపాధ్యక్షులు ప్రతాప్

సికింద్రాబాద్,జూలై16 (విజయ క్రాంతి): చేనేత కార్మికులకు ఉపాధి కల్పించేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇందిరమ్మ చీరలు తయారు చేయించి, అర్హులైన మహిళలకు మహిళా సంఘాల ద్వారా పంపిణి చేస్తోందని కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జంపన ప్రతాప్ అన్నారు. జయనగర్ పార్క్ లో పేద మహిళలకు జంపన ప్రతాప్ గురువారం ఇందిరమ్మ చీరలు పంపిణి చేసారు.

ఈ సందర్భంగా జంపన ప్రతాప్ మాట్లాడుతూ చీరల పంపిణి కార్యక్రమం పారదర్శకంగా జరిగేందుకు ఆధార్ కార్డు, ముఖ గుర్తింపు యాప్ ల ద్వారా మహిళలకు అందచేస్తున్నారని అన్నారు.ఈ కార్యక్రమంలో శరత్, వరప్రసాద్,ముకేశ్,కాలనీ వాసులు మహిళలు పాల్గొన్నారు.