23-11-2025 12:37:33 PM
సామాజికవేత్త, ప్రభుత్వ ఉపాధ్యాయుడు రాచకొండ ప్రభాకర్
తుంగతుర్తి(విజయ క్రాంతి): సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం కొత్తగూడెం టోల్గేట్ దగ్గర గంజాయి డ్రగ్స్ కు వ్యతిరేకంగా యమధర్మరాజు రూపంలో రాచకొండ ప్రభాకర్ ప్రభుత్వ ఉపాధ్యాయులు సామాజిక కార్యకర్త అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా యువత గంజాయి డ్రగ్స్ మత్తు పదార్థాలకు అలవాటు పడి తమ అమూల్యమైన జీవితాన్ని కోల్పోతున్నారు. అలాగే ఏమి తెలియని అమాయకులను కూడా ప్రమాదాల రూపంలో బలి తీసుకుంటున్నారు.
మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాలు తీసుకోవద్దని, నోడ్రగ్స్ సేవ్ లైఫ్ అని ఈ సందర్భంగా పిలుపునివ్వడం జరిగింది. రోడ్డు ప్రమాదాలు హత్యలు అత్యాచారాలకు ప్రధాన కారణం మత్తు పదార్థాలను సేవించడమే కాబట్టి ప్రభాకర్ యముడు రూపంలో యమలోకం నుండి భూలోకంలోకి వచ్చి అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. రాష్ట్ర వ్యక్తంగా గంజాయి డ్రగ్స్ కు వ్యతిరేకంగా ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు, సందేశాలతో కరపత్రాలు పంచుతూ.. మైక్ సెట్ ద్వారా ఫ్లెక్స్ ల ద్వారా అవగాహన కార్యక్రమ లు చేస్తున్నారు. ఈ కార్యక్రమం లో ఉప్పుల రాజు యాదవ్, మల్లెపాక లెనిన్, విలేకరు,సైదులు, సందీప్, తదితరులు పాల్గొన్నారు.