calender_icon.png 23 November, 2025 | 12:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రపంచ దేశాల్లో సత్యసాయి ట్రస్ట్ సేవలందిస్తోంది

23-11-2025 12:32:40 PM

హైదరాబాద్:  శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో హిల్ వ్యూ ఆడిటోరియంలో శ్రీ సత్యసాయి బాబా శతజయంతి ఉత్సవాలు ఆదివారం ఘనంగా జరుగుతున్నాయి. సత్యసాయి బాబా ఆధ్యాత్మిక ప్రవచనాలు ప్రపంచవ్యాప్తమయ్యాయని, పేద ప్రజలకు నిస్వార్ధ సేవలు అందించారని ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ పేర్నొన్నారు. మానవసేవే మాధవసేవ అని నమ్మి సత్యసాయి ఆచరించారని, సత్యసాయి ప్రపంచమంతా ప్రేమను పంచారన్నారు.

సత్యసాయి లక్షల మందిని సేవా మార్గంలో నడిపించారని, తన సేవల ద్వారా లక్షల మందికి తాగునీరు అందించారని ఉపరాష్ట్రపతి తెలిపారు. ప్రపంచదేశాల్లో సత్యసాయి ట్రస్ట్ సేవలందిస్తోందని, తమిళనాడులో తాగునీటి సదుపాయం కల్పించి ప్రజల దాహార్తి తీర్చారు. దేశ, విదేశాల్లో సత్యసాయిబాబా సిద్ధాంతాలు అమలవుతున్నాయని, సత్యసాయి ట్రస్టుకు లక్షల మంది వాలంటీర్లు ఉన్నారని ఆయన వివరించారు.