23-11-2025 12:51:03 PM
నివాళులు అర్పించిన అధికారులు
రాజన్న సిరిసిల్ల,(విజయక్రాంతి): పుట్టపర్తి సత్యసాయి బాబా శత జయంతి వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. జిల్లా యువజన అండ్ క్రీడల శాఖ ఆధ్వర్యంలో జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో పుట్టపర్తి సత్యసాయి బాబా శత జయంతి వేడుకల సందర్భంగా చిత్రపటానికి జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి రాందాస్, ఈడీ ఎస్సీ కార్పొరేషన్ స్వప్న జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా పుట్టపర్తి సత్యసాయి బాబా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఆయన సేవా కార్యక్రమాలను కొనియాడారు.కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.