23-11-2025 12:40:49 PM
తంగళ్ళపల్లి,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం సారంపల్లి గ్రామంలో మహిళలకు ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా యువజన కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు మునిగేలా రాజు మాట్లాడుతూ... మహిళల సాధికారతే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ఆ దిశగా ప్రజా ప్రభుత్వం మహిళలకు అనేక పథకాల ద్వారా మద్దతు అందిస్తున్నదన్నారు.
మహాలక్ష్మి పథకం ద్వారా ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, మహిళా సంఘాలకు వడ్ల కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, మహిళా సంఘాలకు ఆర్థిక బలం కల్పించే అనేక అవకాశాలు ప్రభుత్వం అందిస్తున్నట్లు వివరించారు. ప్రతి ఇంటికి ఇందిరమ్మ సన్న బియ్యం, చేనేతతో నేసిన నాణ్యమైన చీరల పంపిణీ కూడా ప్రభుత్వం అమలు చేస్తున్నదని తెలిపారు. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ కార్మికులు తయారు చేసిన ఇందిరా మహిళా శక్తి చీరలు రాష్ట్ర మహిళల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలుస్తున్నాయని నాయకులు అభిప్రాయపడ్డారు.