14 August, 2026 | 1:55 AM

మణికొండలో ఇందిరమ్మ చీరల పంపిణీ

14-08-2026 12:35 AM

మణికొండ, ఆగస్టు 13, (విజయక్రాంతి): మహిళల ముఖాల్లో చిరునవ్వు, వారి జీవితాల్లో ఆనందం నింపడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని, మహిళల సంక్షేమం, సాధికారతకు పార్టీ నిరంతరం కట్టుబడి ఉంటుందని రాజేంద్రనగర్ కాన్స్టిట్యూయెన్సీ ‘ఎ’ బ్లాక్ అధ్యక్షురాలు బి.ఇంద్ర పేర్కొన్నారు.

మణికొండ డివిజన్లో గురువారం కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో లబ్ధిదారులకు ఇందిరమ్మ చీరలను అందజేశారు. ఈ కార్యక్రమంలో నార్సింగి సర్కిల్ నెక్నాంపూర్ డివిజన్ మహిళా అధ్యక్షురాలు డాక్టర్ ఎన్. ప్రభావతి, మణికొండ డివిజన్ మహిళా అధ్యక్షురాలు సావిత్రి పాల్గొని చీరలు పంపిణీ చేశారు. ప్రతి కుటుంబానికి అండగా నిలుస్తూ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతామని నాయకులు స్పష్టం చేశారు. కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ మహిళా నాయకులు, స్థానిక మహిళలు పాల్గొన్నారు.