29 May, 2026 | 10:26 PM

మహిళా సంఘాల సభ్యులకు ఇందిరమ్మ చీరల పంపిణీ

29-05-2026 11:32 AM

కరీంనగర్ క్రైమ్ మే29 (విజయక్రాంతి): కరీంనగర్ పట్టణ 23వ డివిజన్ సీతారాంపూర్ లో మహిళా సంఘాల సభ్యులకు  ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కరీంనగర్ జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ డా. సత్తు మల్లేశం ఈ సందర్భంగా సత్తు మల్లేశం మాట్లాడుతూ మహిళల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న మన ప్రభుత్వం, పేద కుటుంబాలకు చెందిన ఆడబిడ్డల ముఖాల్లో చిరునవ్వులు చూడాలనే సంకల్పంతో ఈ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని అన్నారు. 

రాష్ట్రంలో ప్రతి మహిళా ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందాలనేదే మన ప్రభుత్వ లక్ష్యం అని  ప్రజా ప్రభుత్వం ఏర్పాటైనా నుంచి మహిళల, పేదల సంక్షేమమే లక్ష్యంగా సన్నబియ్యం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇళ్ళు, నూతన రేషన్ కార్డులు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం లాంటి అనేక సంక్షేమ పథకాలను అమలు చేసింది. అంతేకాదు సహకారక సంఘాలలో పనిచేసే మహిళలకు వడ్డీ లేని రుణాలను 5 లక్షల నుంచి 10 లక్షల వరకు పెంచింది అని మహిళల సంక్షేమం కోసం ప్రభుత్వం రానున్న రోజుల్లో మరిన్ని సంక్షేమ పథకాలను తీసుకురానుంది అని అర్హులైన ప్రతి మహిళకూ ఈ సంక్షేమ పథకాలు అందేలా  కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ గుమ్మడి రాజకుమార్  మహిళా సంఘాల సభ్యులు మరియు అధికారులు తదితరులు పాల్గొన్నారు.