దోమకొండలో కళ్యాణలక్ష్మి షాదీముబారక్ చెక్కుల పంపిణీ
లబ్ధిదారులకు చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి
దోమకొండ, ఏప్రిల్ 21 (విజయక్రాంతి): పేద కుటుంబాల్లో ఆడపిల్లల వివాహాలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న కళ్యాణ లక్ష్మిషాదీ ముబారక్ పథకాలు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయని ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి అన్నారు. దోమకొండ మండల కేంద్రంలోని రైతు వేదికలో ఆదివారం నిర్వహించిన చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు.
ఈ సందర్భంగా మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 35 మంది లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. గ్రామాల వారీగా దోమకొండకు 14, సంగమేశ్వర్కు 7, అంబార్పేట్కు 6, అంచనూరుకు 3, చింతమాన్పల్లికి 2, ముత్యంపేట్కు 3 చొప్పున చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేద కుటుంబాలపై వివాహ ఖర్చుల భారం తగ్గించేందుకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు దోహదపడుతున్నాయని తెలిపారు. అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు.చెక్కులు అందుకున్న లబ్ధిదారులు ప్రభుత్వానికి, ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, లబ్ధిదారులు పాల్గొన్నారు






